Manchu Manoj: కాలికి గాయంతో ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్... వీడియో ఇదిగో!
- మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ ఈ ఉదయం వార్తలు
- మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారంటూ ప్రచారం
- ఖండించిన మంచు ఫ్యామిలీ
- తాజాగా మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారిన వైనం
మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మోహన్ బాబు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశాడంటూ మంచు మనోజ్ ఇవాళ పోలీసులను ఆశ్రయించినట్టు... కాదు, మనోజే నాపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ వార్తలను మంచు ఫ్యామిలీ ఖండించింది.
అయితే, మంచు మనోజ్ కాలికి గాయంతో ఆసుపత్రిలో చేరడం ఆయా కథనాలకు బలం చేకూర్చుతోంది. హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంచు మనోజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన సరిగా నడవలేకపోతున్న స్థితిలో, భార్య మౌనికతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. ఓ వ్యక్తిని ఆసరాగా చేసుకుని ఆసుపత్రిలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.