Syria: సిరియా అధ్యక్షుడు అసద్ విమానం కూల్చివేత!

Did Bashar al Assads Plane Crash

  • దేశం విడిచి పారిపోతుండగా విమానం కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • అసద్ విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ల ద్వారా వెల్లడి
  • లెబనాన్ పరిధిలో విమానం నేలకూలినట్లు ఈజిప్ట్ రచయిత ట్వీట్

సిరియా రాజధాని డమాస్కస్ లోకి తిరుగుబాటుదారులు ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపెట్టారని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లెబనాన్ గగనతలంలో ఈ ఘటన జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్లలోని వివరాలను తమ పోస్టులకు జతచేస్తున్నారు. ఈజిప్ట్ కు చెందిన రచయిత ఖలీద్ మహమూద్ చేసిన ట్వీట్ ప్రకారం.. సిరియా అధ్యక్షుడు అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం డమాస్కస్ నుంచి బయలుదేరి లెబనాన్ మీదుగా వెళుతుండగా విమానం ఎత్తు సడెన్ గా పడిపోయింది.

లెబనాన్ గగనతలంలో 3,650 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా 1,070 మీటర్ల ఎత్తుకు పడిపోయిందని మహమూద్ చెప్పారు. ఆ తర్వాత విమానం ఆచూకీ రాడార్ కు అందలేదని వివరించారు. విమానం ఎకాఎకిన అంత కిందకు దిగడం, ఆ తర్వాత రాడార్ మీద కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐఎల్ -76 ను ఎవరైనా కూల్చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసద్ విమానం కూలిందని చెబుతున్న ఏరియా లెబనాన్ పరిధిలో ఉంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

  • Loading...

More Telugu News