actress pragya nagra: అది నా వీడియో కాదు.... ఏఐతో సృష్టించారు: ప్రజ్ఞా నగ్రా తీవ్ర ఆవేదన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి ప్రజ్ఞా నగ్రా ఫేక్ వీడియో
- టెక్నాలజీ మనకు సాయం చేయాలే గానీ, దానితో జీవితాలను నాశనం చేయకూడదన్న నటి ప్రజ్ఞా నగ్రా
- ఫేక్ వీడియోపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్, మహారాష్ట్ర సైబర్ పోలీసులకు నటి విజ్ఞప్తి
నటి ప్రజ్ఞా నగ్రాకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫేక్ వీడియోపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ .. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబరాబాద్, మహారాష్ట్ర సైబర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఫేక్ వీడియోపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రజ్ఞా.. టెక్నాలజీ మనకు సాయం చేయాలే గానీ, దానితో జీవితాలను నాశనం చేయకూడదని అన్నారు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. తన లాగా మరో ఏ అమ్మాయికి ఇలా జరగకూడదని ప్రార్ధిస్తున్నానని, ఇలాంటి వాటి విషయంలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.
ఫేక్ వీడియో సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్, మహారాష్ట్ర సైబర్ పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసింది.