JP Nadda: కాంగ్రెస్ ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల పైనే ఆధారపడింది: తెలంగాణ సభలో జేపీ నడ్డా విమర్శలు

JP Nadda public meeting at Hyderabad

  • తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్న జేపీ నడ్డా
  • మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చాం... తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ధీమా
  • కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శ

దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల పైనే ఆధారపడిందని, బీజేపీతో నేరుగా తలపడిన ఏ రాష్ట్రంలో కూడా గెలవలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. 

దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ, 6 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో సింగిల్ గా అత్యధిక సీట్లతో విపక్షంలో ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చామని... తదుపరి ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

More Telugu News