Nara Lokesh: చంద్రబాబు తిన్న ప్లేట్ ను లోకేశ్ తీయడంపై నారా భువనేశ్వరి స్పందన

Nara Bhuvaneswari responds on Nara Lokesh gesture

  • బాపట్ల హైస్కూల్ లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్
  • విద్యార్థులతో చంద్రబాబు, లోకేశ్ మధ్యాహ్న భోజనం
  • ఆసక్తికర ట్వీట్ చేసిన నారా భువనేశ్వరి

ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై నారా భువనేశ్వరి స్పందించారు. 

"వెల్ డన్ నారా లోకేశ్... చంద్రబాబు తిన్న ప్లేట్ ను నువ్వు తీయడం, భోజన అనంతరం శుభ్రం చేస్తున్న సిబ్బందికి సాయపడడం... తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెప్పడమే కాదు, నిత్యం మనకు సహాయకారిగా ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది... నిజంగా  ఇది స్ఫూర్తిదాయకం" అంటూ నారా భువనేశ్వరి తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆమె వీడియో కూడా పంచుకున్నారు.

  • Loading...

More Telugu News