Samajwadi Party: మహా వికాస్ అఘాడీకి షాక్... గుడ్ బై చెప్పిన సమాజ్ వాదీ పార్టీ

Samajwadi Party decides to come out from MVA

  • మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి పరాజయం
  • బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ వివాదాస్పద పోస్ట్
  • కూటమి నుంచి తప్పుకుంటున్నామన్న మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ చీఫ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇండియా కూటమి పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ సర్వేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

సోషల్ మీడియాలో మిలింద్ స్పందస్తూ... బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న వారి పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ చర్యపై సమాజ్ వాదీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి, శివసేన (యూబీటీ)కి తేడా ఏముందని సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ మండిపడ్డారు. ఈ విషయాన్ని తమ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మహా వికాస్ అఘాడీ నుంచి తాము వైదొలగుతున్నామని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. అబు అజ్మీ ప్రకటనపై శివసేన (యూబీటీ) ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News