Borugadda Anil: బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కస్టడీలోకి తీసుకున్న అనంతపురం పోలీసులు
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై అసభ్యకర పోస్టుల కేసు
- ఇప్పటికే బోరుగడ్డపై పలు కేసులు నమోదు
- మూడు రోజుల కస్టడీకి తీసుకున్న అనంతపురం పోలీసులు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కూటమి నేతలను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న బోరుగడ్డను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను అనంతపురంకు తరలిస్తున్నారు. అనంతపురం ఫోర్త్ టౌన్ పీఎస్ లో బోరుగడ్డపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తమకు మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు కస్టడీకి అనుమతించింది. కోర్టు అనుమతి మేరకు బోరుగడ్డను అనంతపురంకు తరలిస్తున్నారు.