Narayana Murthy: మరో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
- బెంగళూరులో కింగ్ ఫిషర్ టవర్స్ లో ఫ్లాట్ కొనుగోలు
- ఫ్లాట్ ధర రూ. 50 కోట్లు
- ఫ్లాట్ విస్తీర్ణం 8,400 చదరపు అడుగులు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులో మరో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. నగర నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతం యూబీ సిటీలో ఉన్న కింగ్ ఫిషర్స్ టవర్స్ లోనే రెండో ఫ్లాట్ ను ఆయన కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 16వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ ధర రూ. 50 కోట్లు అని సమాచారం.
ఈ ఫ్లాట్ విస్తీర్ణం 8,400 చదరపు అడుగులు. ఇందులో నాలుగు బెడ్ రూమ్ లు ఉన్నాయి. ఐదు కార్లు పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ మధ్య కాలంలో జరిగిన అపార్ట్ మెంట్ రెసిడెన్సియల్ ప్రాపర్టీ లావాదేవీల్లో ఇదే అత్యధికమని జాతీయ మీడియా తెలిపింది. ఒక్క చదరపు అడుగు దాదాపు రూ. 59,500 పలికిందని సమాచారం. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి ఈ ఫ్లాట్ ను నారాయణమూర్తి కొనుగోలు చేశారు.