Viveka Murder Case: వైఎస్ వివేకా పీఏ ఫిర్యాదు కేసు.. పోలీసుల విచారణ
- వివేకా పీఏ ఫిర్యాదుతో పలువురికి నోటీసులు
- శనివారం ఆరుగురిని విచారించిన పోలీసులు
- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వివేకా హత్య కేసు పునర్విచారణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ మురళీ నాయక్ పలువురికి నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. తాజాగా శనివారం ఆరుగురు విచారణకు హాజరయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. సురేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రాజేశ్‌కుమార్ రెడ్డి, భరత్ యాదవ్, వీఆర్వో మహేశ్వరరెడ్డి డీఎస్పీ ముందు హాజరయ్యారు. కాగా, కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు గతేడాది డిసెంబర్ 15న వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు వివేకా కేసు పునర్విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం కృష్ణారెడ్డి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.