Chandrababu: పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో చంద్రబాబు, నారా లోకేశ్
- బాపట్ల మున్సిపల్ స్కూల్ లో చంద్రబాబు, లోకేశ్
- విద్యార్థిని మార్క్స్ రిపోర్టును పరిశీలించిన సీఎం
- ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని సూచన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్లలో పర్యటిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను ట్రాక్ చేయాలని... యూనివర్శిటీ స్థాయి వరకు ట్రాకింగ్ జరగాలని చెప్పారు. ఈ ట్రాకింగ్ వల్ల ఏ విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది... సదరు విద్యార్థి ఏం చదివితే బాగుంటుందనే విషయం అర్థమవుతుందని అన్నారు.
9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో చంద్రబాబు ముచ్చటించారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును ఆయన పరిశీలించారు. ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రూమ్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఇంకోవైపు కడప మున్సిసల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు.