Mamata Banerjee: వారసుడు అంశంపై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

mamata banerjee comments on her successor

  • తన రాజకీయ వారసుడు ఎవరనేది పార్టీ నాయకత్వమే సమష్టిగా నిర్ణయిస్తుందన్న మమతా బెనర్జీ
  • టీఎంసీలో సీనియర్లు, యువ నేతల మధ్య అంతర్గత పోరు
  • పార్టీలో ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం ప్రదర్శించరన్న మమతా బెనర్జీ

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరో పక్క టీఎంసీలో సీనియర్లు, యువ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ రాజకీయ వారసుడు ఎవరు అవుతారనే చర్చ జోరుగా నడుస్తోంది.

ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ వారసుడు ఎవరు? అని మీడియా ప్రశ్నించగా, మీ వారసుడు ఎవరు? అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేసి అసలు జవాబు దాటవేశారు. తన రాజకీయ వారసుడు ఎవరు అనేది పార్టీ నాయకత్వమే సమష్టిగా నిర్ణయిస్తుంది తప్ప తాను కాదని అన్నారు. 'నేను పార్టీ కాదు.. మేమంతా కలిస్తేనే పార్టీ. ఇది సమష్టి కుటుంబం, నిర్ణయాలు సమష్టిగా తీసుకుంటాం' అని పేర్కొన్నారు. 

టీఎంసీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం ప్రదర్శించరని ఆమె అన్నారు. ప్రజలకు ఏది మంచిదో పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు. తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూత్ కార్యకర్తలు ఉన్నారని, ఇదంతా వారి సమష్టి కృషేనని అన్నారు. 

  • Loading...

More Telugu News