Pushpa-2: పుష్ప-2 అనధికార వీడియోలపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన

Mythri Movie Makers tweets on Pushpa2 unofficial videos

  • డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2
  • తొలి రోజు రూ.294 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డు
  • పైరసీ వీడియోలపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందన 

తెలుగు రాష్ట్రాల పరిధిని మించిపోయి, భారతదేశ సరిహద్దులు దాటుకుని పుష్ప-2 ప్రభంజనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు, యావత్ భారతదేశ సినీ చరిత్రలోనే వసూళ్ల పరంగా ఫస్ట్ డే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. 

డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 12 వేల స్క్రీన్లపై విడుదలైన పుష్ప-2 ది రూల్... తొలి రోజున రూ.294 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారతదేశ సినీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని ఘనతను ఓ తెలుగు చిత్రం సాధించడం విశేషం. 

ఇక అసలు విషయానికొస్తే... పుష్ప-2 చిత్రానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి రావడం పట్ల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

"పుష్ప-2 సినిమాకు చెందిన అనధికార వీడియోలు, చిత్ర కథకు సంబంధించిన వివరణల (స్పాయిలర్లు)తో కూడిన అనధికార వీడియోలు ఏవైనా మీ దృష్టికి వస్తే వెంటనే యాంటీ పైరసీ కంట్రోల్ రూమ్ (యాంటీ పైరసీ సొల్యూషన్స్)కు నివేదించండి. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. claims@antipiracysolutions.org ఈ మెయిల్ ద్వారా గానీ... వాట్సాప్ నెంబరు 8978650014 ద్వారా గానీ సమాచారం అందించవచ్చు" అంటూ ట్వీట్ చేసింది. 

అంతేకాదు, కొందరు ఇవే పుష్ప-2 డైలాగులు అంటూ సొంతంగా కొన్ని డైలాగులు రూపొందించి ప్రచారం చేస్తున్నారని, వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News