Kendriya Vidyalaya: ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
- దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- ఏపీలో పలు జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు
- కేంద్రం పరిధిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలు
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు.
రాష్ట్రంలో అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు పేరుంది. వీటిలో సీబీఎస్ఈ సిలబస్ తో బోధన ఉంటుంది. విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి.