Soldier Death: సెర్చ్ ఆపరేషన్ లో విషాదం... గుండెపోటుతో జవాను హఠాన్మరణం

Soldier died with heart attack while search operation in Jammu and Kashmir

  • ఫఖీర్ గుజ్రీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం
  • తనిఖీలు చేపట్టిన సైన్యం
  • గుండెపోటుకు గురైన జవాను

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కోసం సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా... ఓ జవాను గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. మరణించిన జవానును జస్వీందర్ సింగ్ గా గుర్తించారు. అతడు 34 అస్సామ్ రైఫిల్స్ రెజిమెంట్ కు చెందినవాడు. 

ఈ ఉదయం ఫఖీర్ గుజ్రీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా జవాను జస్వీందర్ సింగ్ గుండెపోటుకు గురయ్యాడు. అతడ్ని బతికించేందుకు సైన్యం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జస్వీందర్ సింగ్ మృతితో అతడి రెజిమెంట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News