Kakinada Port Rice Smuggling: కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా... వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా
- ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం
- 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో విచారణ నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఆరుగురితో సిట్ ను ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ఈ సిట్ కు నాయకత్వం వహిస్తారు. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు గోవిందరావు, అశోక్ వర్ధన్, రత్తయ్య, బాలసుందర్ రావు నియమితులయ్యారు.
బియ్యం అక్రమ రవాణాపై 13 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో సిట్ కు ప్రభుత్వం పలు అధికారాలను కల్పించింది. తనిఖీలు, జప్తులు, అరెస్ట్ చేసేందుకు అధికారాలు కల్పించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.