Etela Rajender: రేవంత్ రెడ్డి హోదా, స్థాయిని మరిచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు: ఈటల రాజేందర్

Etala Rajendar fires at Revanth Reddy for his comments

  • కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరిక
  • తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత హామీలతో దగా చేస్తోందని విమర్శ
  • ఏడాది కాలంలో ఏం చేశారని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయన్న బీజేపీ ఎంపీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను, స్థాయిని మరిచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్ష జరగాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన ఈటల మాట్లాడుతూ... రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని మోదీ సమున్నతంగా కాపాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు.

ప్రజలకు ఏం మంచి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందో చెప్పాలన్నారు. ప్రజాక్షేత్రంలో తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో ఏం చేశారని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఖండిస్తూ నిర్వహించబోయే సభకు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News