YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to YS Bhaskar Reddy

  • భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
  • బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
  • తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తొలుత సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరూతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 

సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ప్రతివాదులు భాస్కర్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సునీత పిటిషన్ తో జతచేస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News