Nagarjuna: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగార్జున, చైతూ, శోభిత

Nagarjuna family visited Srisailam

  • ఇటీవల జరిగిన నాగచైతన్య, శోభిత పెళ్లి
  • కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాగార్జున
  • స్వామి వారికి రుద్రాభిషేకం చేసిన నాగార్జున కుటుంబం

ప్రముఖ సినీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య, కొత్త కోడలు శోభిత శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున మల్లన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. 

స్వామి వారి దర్శనానంతరం నూతన దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News