Rashmika Mandanna: విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప-2 సినిమా చూసిన రష్మిక!

rashmika spotted watching pushpa 2 in amb vijay deverakondas family

  • మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్‌లో సినిమాను వీక్షించిన రష్మిక
  • రష్మిక నటనకు అభిమానుల నుంచి భారీగా ప్రశంసలు
  • సోషల్ మీడియా వేదికగా ప్రశంసలపై స్పందిస్తూ థాంక్స్ చెబుతున్న రష్మిక

అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్‌లుగా నటించిన పుష్ప - 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న హీరోయిన్ రష్మిక .. నిన్న తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఈ సినిమాను వీక్షించింది. 

హైదరాబాద్‌లో మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్‌లో విజయ్ దేవరకొండ తల్లితో పాటు ఆయన సోదరుడు అనంద్ దేవరకొండతో కలిసి రష్మిక ఈ సినిమా చూసింది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో అల్లు అర్జున్ భార్యగా రష్మిక నటించగా, ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక .. తనకు వస్తున్న ప్రశంసలపై స్పందిస్తూ అందరికీ థాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతోంది.     

  • Loading...

More Telugu News