Chandrababu: రైతుల ఆందోళనపై కృష్ణా జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

CM Chandrababu talks to Krishna district collector

  • ధాన్యం కొనుగోళ్ల అంశంపై కృష్ణా జిల్లా రైతుల ఆందోళన
  • చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులు
  • కృష్ణా జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఆదేశాలు
  • వెంటనే వల్లూరిపాలెం వెళ్లిన కలెక్టర్

ధాన్యం కొనుగోళ్ల అంశంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. రైతుల ఆందోళనపై కృష్ణా జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. 

ఈ అంశంలో అధికారుల నిర్లక్ష్యం కారణమైతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కృష్ణా జిల్లా కలెక్టర్ వెంటనే వల్లూరిపాలెం వెళ్లారు. రైతులు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News