Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రాలయ పీఠాధిపతి రూ. 50 లక్షల విరాళం

Mantralaya Peethadhipathi Subudhendra Theertha Swamiji Donates Rs 50 Lakhs To Amaravati

   


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు రూ. 50 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసిన పీఠాధిపతి, మఠం సభ్యులు ఆయనను ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా మంత్రాలయం తరపున రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రూ. 50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను కలిసి ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి విరాళం అందించిన సుబుదేంద్ర తీర్థులు, మఠం సభ్యులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News