Tirumala: అలిపిరి టోల్ గేట్ వద్ద తెలిసో తెలియకో రీల్ చేసి తప్పుచేశా.. క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన యువతి

Alipiri dancing girl apology to devotees

  • మోడ్రన్ దుస్తుల్లో రీల్ చేసి అప్ లోడ్ చేసిన యువతి
  • అలిపిరి వద్ద డ్యాన్స్ చేయడంతో విమర్శలు
  • ఇంకెప్పుడూ ఇలా చేయనని స్పష్టీకరణ

తిరుమల వెళ్తూ అలిపిరి శ్రీవారి పాదాల చెంత పుష్ప-2 సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసిన యువతి ఆ తర్వాత శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పింది. దయచేసి తనను క్షమించాలంటూ వీడియోను విడుదల చేసింది. సదరు యువతి మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇది విమర్శలకు దారి తీసింది.

అలిపిరి టోల్ గేట్ ముందు డ్యాన్స్ చేయడమేమిటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని భక్తులు టీటీడీని కోరారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం ఆ యువతిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైంది.

క్షమించాలంటూ మరో వీడియో

పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యువతి భక్తులను క్షమాపణలు కోరింది. ఏదో తెలిసో... తెలియకో తప్పు చేశానంది. ఏదో అక్కడ క్లైమేట్ బాగుందని, ఆ రీల్ కూడా ట్రెండింగ్‌లో ఉంది కదా అని అనుకోకుండా అక్కడ డ్యాన్స్ చేసినట్లు చెప్పింది. మరోసారి ఇలాంటి తప్పు చేయనంది. దయచేసి తన తప్పును ఈసారికి క్షమించాలని, ఇంకెప్పుడూ ఇలా చేయనని తెలిపింది. తనను చూసి అలా చేయాలని ఎవరైనా భావిస్తే అలాంటి తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News