Nadendla Manohar: 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు వేస్తున్నాం: మంత్రి నాదెండ్ల

AP Govt 100 Percent Help Farmers says Minister Nadendla Manohar

  • వంద‌కు వంద శాతం తాము అన్న‌దాత‌కు అండ‌గా నిల‌స్తున్నామ‌న్న నాదెండ్ల‌
  • గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఈ స‌మ‌యానికి సేక‌రించిన ధాన్యం 4.43 మెట్రిక్ ట‌న్నులు
  • అదే కూట‌మి ప్ర‌భుత్వం 9.14 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించింద‌ని వివ‌ర‌ణ‌
  • రైతుల‌ను చంద్ర‌బాబు రోడ్డున ప‌డేశార‌ని జ‌గ‌న్ చేసిన ట్వీట్‌కు మంత్రి కౌంట‌ర్‌

రైతుల‌కు అండ‌గా నిలుస్తున్నది కూట‌మి ప్ర‌భుత్వ‌మేన‌ని ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహర్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఈ స‌మ‌యానికి సేక‌రించిన ధాన్యం 4.43 మెట్రిక్ ట‌న్నులుగా ఉంటే.. బాధ్య‌త‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు 9.14 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించింద‌ని తెలిపారు. ధాన్యాన్ని సేక‌రించిన‌ 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు. 

వంద‌కు వంద శాతం తాము అన్న‌దాత‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని, ఈ విష‌యాన్ని మాజీ సీఎం జ‌గ‌న్ తెలుసుకోవాల‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ, రైతుల‌ను చంద్ర‌బాబు రోడ్డున ప‌డేశార‌ని జ‌గ‌న్ చేసిన ట్వీట్‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేశారు. జిల్లాల వారీగా 2023-24లో సేక‌రించిన ధాన్యం, 2024-25 ఏడాదిలో సేక‌రించిన ధాన్యం వివ‌రాలను నాదెండ్ల వివ‌రించారు.

  • Loading...

More Telugu News