Harish Rao: హరీశ్ రావుపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు

Police case against Harish Rao

  • హరీశ్ పై చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు
  • ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులతో వేధించారన్న చక్రధర్
  • పలు సెక్షన్ల కింద హరీశ్ పై కేసు నమోదు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కేసు నమోదయింది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదయింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీంతో, ఆయనపై సెక్షన్లు 120(బీ), 386, 409, 506, రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హరీశ్ తో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News