Tamannaah: 'జైలర్' సినిమాలోని పాటపై ఇప్పటికీ బాధగా ఉంది: తమన్నా
- ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన తమన్నా
- తమన్నా ఐటెం సాంగ్ చేసిన పాటలన్నీ హిట్
- 'జైలర్' సినిమాలో పాటను ఇంకా బాగా చేసుండవచ్చన్న తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గ్లామర్ షో చేయడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. తమన్నా ఐటెం సాంగ్స్ చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో కూడా తమన్నా ఐటెం సాంగ్ చేసింది. 'నువ్వు కావాలయ్యా...' అనే పాట సూపర్ హిట్ అయింది. కుర్రకారును ఈ పాట ఉర్రూతలూగించింది. ఈ పాట గురించి తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేదనే బాధ తనలో ఉందని చెప్పింది. ఇంకా బాగా చేసుండవచ్చనే ఫీలింగ్ తనలో ఉందని తెలిపింది. బాలీవుడ్ సినిమా 'స్త్రీ 2' చిత్రంలో తాను చేసిన 'ఆజ్ కీ రాత్' పాట తనకు చాలా సంతృప్తినిచ్చిందని వెల్లడించింది.