Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం

5 MBBS Students Killed As Their Car Collides With Bus In Kerala

  • ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన కారు
  • ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఘోరం
  • స్పాట్ లోనే ముగ్గురు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి

కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు..

వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. ముగ్గురు స్టూడెంట్లు అక్కడికక్కడే చనిపోయారు.

బస్సు ప్రయాణికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు స్టూడెంట్లను అలప్పుజ జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News