kriti sanon: తన లక్ష్యమేమిటో వెల్లడించిన కృతిసనన్

kriti sanon about her production house

  • నటి నుంచి నిర్మాతగా మారిన కృతిసనన్  
  • టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కృతి  
  • సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచే చిత్రాలను రూపొందించడమే తన లక్ష్యమన్న కృతిసనన్  

‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృతిసనన్ .. తదుపరి 'దోచేయ్' చిత్రంలో మెరిసింది. అయితే రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి వరుసగా హిందీలో చిత్రాలతో బిజీగా ఉంది. నటి నుంచి నిర్మాతగా మారిన కృతిసనన్ .. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను స్థాపించింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె నిర్మాతగా తన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేరీర్‌లో కొత్త దశను ఆస్వాదిస్తున్నానని, తన నిర్మాణ సంస్థ ద్వారా మరికొన్ని సీతాకోకచిలుకలు రాబోతున్నాయని చెప్పింది. ఇందుకోసం భారతీయ సినిమాలో తెరపైకి రాని కథల కోసం రీసెర్చ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే సందర్భంలో తన లక్ష్యాన్ని కూడా కృతిసనన్ వెల్లడించింది.
 
సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచే చిత్రాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కృతిసనన్ తెలిపింది. సమాజానికి ఉపయోగపడే చిత్రాలను నిర్మించే స్థాయికి భవిష్యత్తులో చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ నటించిన పాత్రలను సృష్టించుకునే అవకాశం తనకు ఉండటం సంతోషంగా ఉందని పేర్కొంది. 

  • Loading...

More Telugu News