SI Suicide: తపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

SI suicide in Mulugu district

  • ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదం
  • రిసార్ట్స్ లో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై హరీశ్
  • కుటుంబ కలహాలే కారణమని సమాచారం

తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలో ఉన్న ఫెరిడో రిసార్ట్స్ లో బలవన్మరణానికి పాల్పడ్డారు.

నిన్న ఉదయం ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిన హరీశ్... రిసార్ట్స్ లో గది అద్దెకు తీసుకున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో... వారు వాజేడు పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. రిసార్ట్స్ కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా... ఆయన విగతజీవిగా కనిపించారు. 

పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే ఆయన ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News