hyderabad traffic police: పుప్ప - 2 ప్రీ రిలీజ్ వేడుక .. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- హైదరాబాద్‌లో నేడు పుష్ప – 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎనిమిదివేల పాసులు జారీ చేసిన నిర్వాహకులు
- యూసఫ్‌గూడ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- 300 మందితో పోలీస్ బందోబస్తు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 మూవీ ఈ నెల 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం యూసుఫ్‌గూడ మొదటి పటాలం ప్రాంగణంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం నిర్వహిస్తోంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు దాదాపు ఎనిమిది వేల మందికి నిర్వాహకులు పాసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఏసీపీ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. వేడుక ప్రాంతాన్ని నిన్న అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్.. పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్, పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, శ్రేయాస్ మీడియా నిర్వాహకుడు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.
.