kanthi dutt: హీరోయిన్లను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

kanthi dutt who cheated samantha keerthy suresh got arrested

  • తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
  • వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను పెట్టుబడుల పేరుతో మోసం చేశారన్న అభియోగాలు
  • బాధితుల్లో సినీ, వ్యాపార ప్రముఖులు

సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్తను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వాటాల పేరుతో మోసాలకు పాల్పడిన తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి మోసగించాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 

నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి సమంత సన్నిహితురాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుండి కాంతి దత్ కోసం గాలిస్తున్నారు. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేశ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, పరిణితి చోప్రా వంటి వాళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంతి దత్ దాదాపు వంద కోట్లకుపైగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News