Attacks On Hindus: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు... విశాఖలో నిరసనలు ఉద్రిక్తం

Hindu organisations protests in Visakha

  • బంగ్లాదేశ్ లో అరాచక పరిస్థితులు
  • హిందువులపై దాడులు
  • విశాఖ ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద హిందూ సంఘాల నిరసన
  • ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా బలవంతంగా తప్పుకోవాల్సి రావడం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం, ఇటీవల హిందువులపై దాడులు జరుగుతుండడం తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ప్రకంపనలు ఏపీలోని విశాఖలోనూ వినిపించాయి. 

నేడు ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ్ సమితి, హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ... నినాదాలు చేశారు. ఇక్కడి హాస్టళ్లలోని బంగ్లాదేశీ విద్యార్థులు వారి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలో, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News