Chandrababu: బూడిద తరలింపు వివాదం.. జేసీ అస్మిత్‌రెడ్డిపై చంద్రబాబు ఫైర్
నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమానాశ్రయంలో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డిని మందలించినట్టు తెలిసింది. వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపునకు సంబంధించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదంలోనే చంద్రబాబు ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్పితే ఇలా బాహాటంగా గొడవలకు దిగడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, కార్యకర్తలకు పనులు అప్పగించేందుకే ఇలా చేస్తున్నట్టు అస్మిత్‌రెడ్డి చెప్పగా, వారి విషయం తాను చూసుకుంటానని, గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.