Kadambari Jethwani: నటి జెత్వానీ కేసు: ఐపీఎస్ లకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ అఫిడవిట్

CID submits affidavit in actress Kadambari Jethwani case

  • సంచలనం సృష్టించిన కాదంబరి జెత్వానీ వ్యవహారం
  • ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన ఐపీఎస్ అధికారులు
  • ఏపీ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించిన సీఐడీ

ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, కొందరు పోలీసులు, ఓ న్యాయవాది పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో, సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో... చట్టాన్ని కాపాడాల్సిన వారే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వివరించింది. జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారని అఫిడవిట్ లో ఆరోపించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని అఫిడవిట్ లో పేర్కొంది. అప్పటి సీపీ కాంతిరాణా తాతా ముంబయికి విమాన టికెట్లు బుక్ చేశారని తెలిపింది. 

బెయిల్ ఇస్తే దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశముందని సీఐడీ స్పష్టం చేసింది. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం నాడు విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News