Telangana: జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ
- కేబినెట్ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు
- మార్గదర్శకాలు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
- ఉద్యోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని పేర్కొన్న ప్రభుత్వం
జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా సీఎస్ శాంతికుమారి మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన జీవో ఎంఎస్ నెం. 243, 244, 245 జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వీటికి సంబంధించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలను జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రభుత్వం అందులో పేర్కొంది.