Vaibhav Suryavanshi: ఐపీఎల్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీకి భారత జూనియర్ జట్టులో చోటు.. పాక్‌తో నేటి మ్యాచ్‌లో బరిలోకి

Vaibhav Suryavanshi features in India U19s against Pakistan

  • ఆసియాకప్‌లో భాగంగా నేడు తలపడుతున్న భారత్-పాక్ జూనియర్ జట్లు
  • ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న సూర్యవంశీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన పాక్

ఐపీఎల్ మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు అమ్ముడుపోయి 13 ఏళ్లకే కోటీశ్వరుడిగా మారిన వైభవ్ సూర్యవంశీకి ఇండియా అండర్-19 జట్టులో చోటు లభించింది. ఆసియాకప్ 2024 టోర్నీలో భాగంగా భారత్ నేడు తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవల రెండ్రోజులపాటు నిర్వహించిన వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. అంతేకాదు, అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడైన క్రికెటర్‌గానూ చరిత్రకెక్కాడు. అండర్-19 టెస్టుల్లో సూర్యవంశీ అత్యంత వేగంగా సెంచరీ సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అక్టోబర్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లోనే అతడు శతకం నమోదు చేశాడు. 

  • Loading...

More Telugu News