TRAI: వచ్చే నెల నుంచి ఓటీపీలు ఆలస్యం అవుతాయా... ట్రాయ్ ఏమంటోందంటే...!

trai ensures no delays in otp deliveries from december 1 amid new traceability rules

  • మేసేజ్‌ల డెలివరీలో ఎటువంటి జాప్యం ఉండబోదని చెప్పిన ట్రాయ్
  • ఓటీపీ మెసేజ్‌లు ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ట్రాయ్ 
  • రేపటి నుంచి ప్రతి ఎస్ఎంఎస్ మూలాన్ని గుర్తించనున్న టెలికం సంస్థలు

డిసెంబర్ 1 నుంచి మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి జాప్యం ఉండబోదని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తెలిపింది. సైబర్ నేరాల నిరోధానికి ఎస్ఎంఎస్‌ ఎక్కడ నుంచి వస్తుందో గుర్తించాలని టెలికం సంస్థలు ఇచ్చిన ఆదేశాలతో బ్యాంకింగ్ సేవలు, ఈ కామర్స్ సంస్థల ఓటీపీ మెసేజ్‌లు డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై ట్రాయ్ స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్రాయ్ స్పష్టం చేసింది.  

స్పామ్ కాల్స్, ఎంఎంఎస్‌లకు చెక్ పెట్టడానికి ట్రాయ్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో భాగంగా బల్క్ ఎస్ఎంఎస్‌లు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి టెలికం సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఫ్రాడ్ మెసేజ్‌లు అరికట్టడానికి ట్రాయ్ ట్రేసబిలిటీ విధానం తీసుకువచ్చింది. దీన్ని నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని తొలుత భావించినప్పటికీ టెలికం సంస్థలు సన్నద్ధం కాకపోవడంతో ఈ నెలాఖరు వరకూ పొడిగించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రతి ఎస్ఎంఎస్ ఎక్కడ నుంచి వస్తుందో టెలికం సంస్థలు తప్పనిసరిగా గుర్తించడం జరుగుతుంది. 

  • Loading...

More Telugu News