Telangana: పులివెందులలో వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు!
- సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను అద్దెకు తీసుకెళ్లిన వైసీపీ నేతలు
- కార్లు అడిగితే కొట్టారని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన సతీశ్ కుమార్
- పులివెందుల పోలీసుల సాయంతో కార్లను గుర్తించిన తెలంగాణ పోలీసులు
- సతీశ్ కుమార్‌కు కార్లను అప్పగించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో... తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను పోలీసులు విడిపించారు. ఈ కార్లు పులివెందులలో అక్కడి వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు వాటిని విడిపించారు. ఈ కార్లను దాదాపు మూడేళ్లుగా వైసీపీ నేతలు వినియోగిస్తున్నారు.
పులివెందుల మెడికల్ కాలేజీ కోసమని చెప్పి సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్‌కు చెందిన ఆరు కార్లను అక్కడి వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్‌పై తీసుకెళ్లారు.
ఆ కార్లను తీసుకెళ్లిన వైసీపీ నేతల ఆచూకీ సతీష్ కుమార్‌కు లభించలేదు. జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా కార్లు వేంపల్లెలో ఉన్నట్లుగా గుర్తించాడు. అక్కడకు వెళ్ళి తన కార్లను ఇచ్చేయాలని తాను అడగగా... ఇడుపులపాయలో తనను బంధించి కొట్టారని సతీశ్ కుమార్ ఆరోపించాడు. ఈ మేరకు 2021లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో తిరిగారు. కార్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని సతీష్ కుమార్‌కు అప్పగించారు.