Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లలో అదనపు గదులకు అనుమతి: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

CM Revanth Reddy says poor people should be given priority

  • కూలీలు, సాగుభూమిలేని వారికి, పారిశుద్ధ్య కార్మికులను ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
  • ఇళ్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
  • అదనపు గదులు కోరుకుంటే లబ్ధిదారులకు అవకాశమివ్వాలని సూచన

ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విషయంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ఈరోజు సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయమై గ్రామకార్యదర్శితో పాటు మండలస్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు తగినటువంటి సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. శాఖాపరంగా కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దన్నారు.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప‌రిధిలో ప్రత్యేక కోటా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిర‌మ్మ ఇళ్లకు అదనపు గదులు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తి కనబరిస్తే అనుమతించాలన్నారు. ఈ పథకం సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ నియమించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News