Guntur District: రితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు

Guntur district court verdict on Ritheshwari suicide case

  • 2015లో వరంగల్‌కు చెందిన రితేశ్వరి ఆత్మహత్య 
  • న్యాయం కోసం తొమ్మిదేళ్లుగా పోరాడుతున్న తల్లిదండ్రులు
  • ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కేసును కొట్టేసిన కోర్టు

వరంగల్ జిల్లాకు చెందిన రితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నారు. రితేశ్వరి తల్లిదండ్రులు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్నారు.

నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.

ర్యాగింగ్, వేధింపుల కారణంగా 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తాను ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. గుంటూరు కోర్టులో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News