Vokkaliga Peethadhipathi: ముస్లింలకు ఓటు హక్కు వద్దన్న పీఠాధిపతి... కేసు నమోదు

FIR on Vokkaliga peethadhipathi

  • ముస్లింలపై విశ్వ ఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలని వ్యాఖ్య
  • స్వామీజీపై ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు

ముస్లింలకు ఓటు హక్కు వద్దని... వారి ఓటు హక్కును రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటకలోని విశ్వ ఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామీజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

గత మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ముస్లింలకు ఓటు లేకుండా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. కనిపించిన భూములన్నీ తమవేనని వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మం కాదని చెప్పారు. 

మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చంద్రశేఖర స్వామీజీ క్షమాపణలు చెప్పారు. ముస్లింలు కూడా దేశ పౌరులేనని, ఓటు వేసే హక్కు వారికి ఉందని అన్నారు. అయితే ముస్లింలపై స్వామీజీ చేసిన వ్యాఖ్యలపై ఒక సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Vokkaliga Peethadhipathi
Muslims
  • Loading...

More Telugu News