Mountain Snake: అన‌కాప‌ల్లిలో 12 అడుగుల గిరినాగు.. భ‌యంతో స్థానికుల ప‌రుగులు

Mountain Snake Moves in Anakapalle

  • అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో క‌నిపించిన‌ భారీ గిరినాగు
  • ఓ రైతు పొలంలో తిష్ట వేసిన భారీ స‌ర్పం 
  • స్నేక్ క్యాచర్స్ సాయంతో నాగును ప‌ట్టుకుని అడ‌వుల్లో వ‌దిలిపెట్టిన అట‌వీ శాఖ సిబ్బంది

ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు స్థానికుల‌ను భ‌య‌పెట్టింది. 12 అడుగుల భారీ గిరినాగు స్థానికంగా ఉండే ఓ రైతు పొలంలో తిష్ట వేసింది. జ‌నం చూస్తుండ‌గానే ఓ రక్తపింజరను వేటాడి మ‌రీ మింగేసింది. అది చూసిన అక్కడి వారంతా భయంతో పరుగు అందుకున్నారు. 

వెంటనే స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అట‌వీ శాఖ సిబ్బంది వారు స్నేక్ స్నాచర్స్‌ను పిలిపించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దూరంగా ఉన్నా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ గిరినాగు తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News