Woman Commando: మహిళా కమాండో కాదు.. ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఆఫీసర్

Kangana Ranaut shares photo of woman commando walking with PM Modi

  • ప్రధాని మోదీ వెనక మహిళా ఆఫీసర్ ఫొటో వైరల్
  • ప్రధాని భద్రతా సిబ్బందిలో తొలి మహిళా కమాండో అంటూ ప్రచారం
  • ఎంపీ కంగనా రనౌత్ షేర్ చేసిన ఫొటోతో ఊహాగానాలు

బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల షేర్ చేసిన ప్రధాని మోదీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మోదీ వెనక ఓ మహిళా సెక్యూరిటీ ఆఫీసర్ ఉండడమే దీనికి కారణం. ప్రధాని భద్రతా సిబ్బందిలో తొలిసారి మహిళా కమాండో నియామకం అంటూ నెట్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో భద్రతా బలగాలు తాజాగా స్పందిస్తూ.. కొందరు మహిళా ఎస్‌పీజీ కమాండోలు ‘క్లోజ్‌ ప్రొటెక్షన్ టీమ్‌’లో సభ్యులుగా ఉన్నట్లు తెలిపాయి. అయితే, ప్రస్తుతం వైరల్ గా మారిన ఫొటోలో ఉన్న మహిళ మాత్రం అందులో సభ్యురాలు కాదని స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ అని అధికారులు వివరించారు. అంతకుమించిన వివరాలను వారు వెల్లడించలేదు.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత ప్రధాని, వారి కుటుంబాల భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)’. 1985లో ఎస్పీజీ ఏర్పాటైంది. ప్రధానితో పాటు ఆయన/ ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేది. అయితే, రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు, వారి ఫ్యామిలీలకూ ఎస్పీజీ భద్రత కల్పించేలా సవరణ చేశారు. అయితే, 2019లో ఎన్డీయే హయాంలో దీనికి సవరణలు చేసి కేవలం ప్రస్తుత ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే భద్రత కల్పించేలా మార్చారు.

  • Loading...

More Telugu News