Anti aging: రోజూ ఇవి తీసుకుంటే... నిత్య యవ్వనం మీ సొంతం!

anti aging foods what to eat to slow down skin aging

  • వయసు మీద పడిన కొద్దీ వృద్ధాప్య లక్షణాలు రావడం సాధారణమే...
  • చర్మం ముడతలు పడటం, కళావిహీనం కావడం చూస్తుంటాం
  • ఈ లక్షణాలను తగ్గించేందుకు కొన్ని రకాల ఆహారం తోడ్పడుతుందని చెబుతున్న నిపుణులు

వయసు మీద పడిన కొద్దీ వృద్ధాప్య లక్షణాలు రావడం సహజమే. కానీ కొందరిలో 40 ఏళ్లు దాటగానే... చర్మం కళావిహీనం అవడం, ముడతలు పడటం వంటివి ఏర్పడతాయి. శరీరానికి తగిన పోషకాలు అందకపోవడమే దీనికి కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే... 40 ఏళ్ల వయసు అని కాదు, 60 ఏళ్లు దాటినా కూడా తక్కువ వయసు ఉన్నవారిలా కనిపించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని రకాల పదార్థాలు తోడ్పడతాయని వివరిస్తున్నారు.

బ్లూ బెర్రీస్...
వీటిలో అధికంగా ఉండే విటమిన్ సీ, ఈ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్వీర్యం చేస్తాయి. తద్వారా వయసు మీద పడటం వల్ల వచ్చే లక్షణాలను తగ్గిస్తాయి. చర్మం ముడతలు పడకుండా చూస్తాయి.

గ్రీన్ టీ...
దీనిలో కాటెచిన్స్, పాలీఫెనాల్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇన్ ఫ్లమేషన్ ను నివారిస్తాయి. ముఖ్యంగా ఎండకు తిరగడం వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతాయి.

డార్క్ చాకోలెట్...
ముడి చాకోలెట్లలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన చర్మానికి మేలు చేస్తాయి. కనీసం 70 శాతానికి పైగా కొకోవా ఉండే డార్క్ చాకోలెట్లతోనే ఉపయోగం ఉంటుంది. సాధారణ చాకోలెట్లతో ప్రయోజనం తక్కువ అని గుర్తుంచుకోవాలి.

ఆకుకూరలు...
మనలో వయసు మీద పడకుండా కాపాడే ముఖ్యమైన పోషకాలైన విటమిన్ ఏ, సీ, కె తోపాటు ఫోలేట్లు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాల పునరద్ధరణకు, కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతాయి. వీటితో చర్మం ముడతలు పడకుండా, నిగారింపుతో ఉంటుంది.

అవకాడోలు
వీటిలో కూడా విటమిన్ ఈ , సీ రెండూ ఎక్కువే. వీటిలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపు ఇచ్చేందుకు తోడ్పడుతాయి.

ఫ్లాక్స్ సీడ్స్
వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి... చర్మానికి సహజమైన నూనెలు అందేలా చూస్తాయి. దీనితో చర్మం ఎప్పుడూ తడిగా ఉండి... కాంతులీనుతూ ఉంటుంది.

ఫ్యాటీ ఫిష్...
సాల్మన్, మాకరెల్, సార్డైన్స్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం పెడతాయి. వాటితో శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి... చర్మం బిగుతుగా, కాంతులీనుతూ ఉంటుంది.

పసుపు...
అద్భుతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండే పసుపులోని కర్క్యుమిన్... శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, తెల్లగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • పైన చెప్పిన అన్నిరకాల ఆహారమని కాకుండా... వీలైన మేరకు మన రెగ్యులర్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మనలో వృద్ధాప్య లక్షణాలను దూరం పెట్టడానికి బాగా తోడ్పడుతాయని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News