Savitri: లంకంత ఇల్లుని లక్ష రూపాయలకే అమ్మేసిన సావిత్రి!

Kedareshwara Rao Interview

  • సావిత్రిగారి ఇంట్లో పనిచేశానన్న కేదారేశ్వరరావు  
  • ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉండేదని వెల్లడి 
  • 7 ఖరీదైన కార్లు ఉండేవని వివరణ 
  • 'ప్రాప్తం' ఫ్లాప్ తరువాత అంతా మారిపోయిందని వ్యాఖ్య    


తెలుగు తెరపైకి సావిత్రికి ముందు ఎంతోమంది కథానాయికలు వచ్చారు .. సావిత్రి తరువాత కూడా ఎంతోమంది నాయికలు వచ్చారు. కానీ 'మహానటి' అని పిలిపించుకున్నది ఆమె మాత్రమే. ఆ స్థాయినీ .. ఆమె స్థానాన్ని ఆ తరువాత మరొకరు చేరలేకపోయారు .. తాకలేకపోయారు. అలాంటి సావిత్రిని గురించి, అప్పట్లో ఆ ఇంట్లో కేర్ టేకర్ గా ఉన్న చెన్న కేదారేశ్వరరావు ప్రస్తావించారు. 

" సావిత్రిగారి ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ ను ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసే పనిలో నేను చేరాను. రోజుకు ఒక గంట పని .. నెలకి 60 రూపాయలు ఇచ్చేవారు. ఒక రోజున  సావిత్రిగారి అబ్బాయి సతీశ్ బాబు స్విమ్మింగ్ పూల్ లో పడితే నేను రక్షించాను. అప్పటి నుంచి బాబును చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి జీతం పెంచారు. సావిత్రిగారి ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత, ఒక ఇల్లు ఇంత అద్భుతంగా ఉంటుందా? అనే ఆశ్చర్యం కలిగింది" అని అన్నారు. 

"సావిత్రి గారి బంగ్లా చాలా పెద్దది. ఆ పక్కనే ఉన్న మరో మూడు చిన్న ఇళ్లు కూడా ఆమెవే. సావిత్రిగారి పెద్ద ఇంట్లో స్విమ్మింగ్ పూల్ తో పాటు పెద్ద గార్డెన్ ఉండేది. వేరు వేరుగా 7 కార్లు పార్క్ చేసి ఉండేవి. కార్లు ఒక గేట్ లో నుంచి లోపలికి వచ్చి, మరో గేట్ ద్వారా బయటకి వెళ్లేవి. అంత పెద్ద బంగళాను ఆమె లక్ష రూపాయలకే అమ్మేశారు. 'ప్రాప్తం' సినిమా సమయంలో డబ్బు అవసరమై ఆమె అలా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయిన దగ్గర నుంచి పరిస్థితులు మారిపోయాయి" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News