Vijaypal: రఘురామ చిత్రహింసల కేసులో... విజయపాల్ కు 14 రోజుల రిమాండ్

Court imposes 14 days remand for Vijaypal

  • కస్టడీలో రఘురామను చిత్రహింసలు పెట్టారంటూ విజయపాల్ పై ఆరోపణలు
  • నాడు సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న విజయపాల్
  • నిన్న అరెస్ట్ చేసిన ఒంగోలు పోలీసులు
  • నేడు కోర్టులో హాజరుపరిచిన వైనం

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు. 

విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దీని వెనుక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో, న్యాయస్థానం విజయపాల్ కు రెండు వారాల రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News