Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాల్లేవు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka on differences with congress leaders

  • మంత్రివర్గ విస్తరణ విషయమై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
  • ప్రతిపక్షాల పసలేని విమర్శలతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్య
  • మూసీ నిర్వాసితులు వ్యాపారం చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తామని హామీ

తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తమలో విభేదాలు అంటూ పసలేని విమర్శలు చేస్తే ప్రతిపక్షాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది కాకుల్లా అరుస్తున్నారని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ విషయమై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

కాగా, మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. హైడ్రా, మూసీ విషయంలో పూర్తిగా ఆలోచించాకే ముందుకు పోతున్నామన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాలు కాజేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు కాజేసిన భూముల వివరాలను బయటకు తీస్తామన్నారు.

  • Loading...

More Telugu News