Patnam Narendra Reddy: లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- లగచర్ల ఘటనలో మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు
- వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన నరేందర్ రెడ్డి
- విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
లగచర్ల ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లగచర్ల దాడి ఘటనలో పోలీసులు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు, ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఏఏజీ కోర్టుకు వివరించారు. పోలీసులు వేర్వేరు కేసులు ఎందుకు నమోదు చేశారో తెలిపారు. ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.