devi sri prasad: అడగకపోతే ఎవరూ ఇవ్వరు... నేను చెప్పింది కరెక్టే కదా బన్నీ...?: దేవి శ్రీ ప్రసాద్

devi sri prasad speech at pushpa 2 event

  • వేదికపైనే పుష్ప నిర్మాతపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం
  • తనపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయన్న దేవిశ్రీ ప్రసాద్
  • ఓపెన్‌గా మాట్లాడటం తనకు అలవాటంటూ దేవిశ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై గత కొన్నాళ్లుగా తనకు ఉన్న అసహనాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బయటపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు దగ్గరైన తర్వాత కూడా ఇంకా మ్యూజిక్ అవుట్ పుట్ రాకపోవడంతో మైత్రి టీమ్ మరి కొంత మంది సంగీత దర్శకులను రంగంలోకి దింపింది. 

డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన దేవీశ్రీ ప్రసాద్ వేదికపైనే తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. 'మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాత ఇచ్చే పారితోషికమైనా, తెరపై మన పనైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ (అల్లు అర్జున్)' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చాలా మంది హీరోయిన్స్ డ్యాన్స్ చేసిన తొలి స్పెషల్ సాంగ్‌కు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ క్రెడిట్ ఏ సంగీత దర్శకుడికీ లేదు' అని అన్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిని సంబోధిస్తూ .. 'నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే .. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు. టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు. టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటారు. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటో అర్ధం కాదు. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20 – 25 నిమిషాలు అవుతుంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి' అని నన్ను ఆపారు. 

లోపలికి వెళ్తాను అంటే నన్ను లోపలికి పంపించలేదు. చివరకు కిస్సక్ పాట విని లోపలికి పరిగెత్తుకొచ్చాను. వచ్చినోడిని 'రాంగ్ టైమింగ్ సార్ లేట్‌గా వచ్చారు' అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేను ఎప్పుడూ అన్ టైమ్ సర్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. నిర్మాతలతో ఎంతైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ ఇలా బహిరంగంగా వేదికపై దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడటం సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయింది. 

  • Loading...

More Telugu News