IPL Auction-2025: ఐపీఎల్ మెగా వేలం: ఎవరు ఎంతకు అమ్ముడయ్యారంటే...!
- సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం
- రిషబ్ పంత్ కు రికార్డు ధర (రూ.27 కోట్లు)
- ఆసక్తికర కొనుగోళ్లు జరిపిన సన్ రైజర్స్
ఐపీఎల్ సీజన్-18 కోసం నేడు, రేపు సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆటగాళ్ల మెగా వేలం నిర్వహిస్తున్నారు. ఇవాళ డే-1 సందర్భంగా అత్యధిక ధర రికార్డులు రెండు సార్లు బద్దలు కావడమే కాకుండా, పలువురు ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇవాళ్టి వేలంలో ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపాలను సొంతం చేసుకుంది.
వేలం వివరాలు...
- రిషబ్ పంత్- రూ.27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- శ్రేయాస్ అయ్యర్- రూ.26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- వెంకటేశ్ అయ్యర్- రూ.23.75 కోట్లు (కేకేఆర్)
- యజువేంద్ర చహల్- రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- జోష్ హేజిల్ వుడ్- రూ.12.50 కోట్లు (ఆర్సీబీ)
- జోఫ్రా ఆర్చర్- రూ.12.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- ట్రెంట్ బౌల్ట్- రూ.12.50 కోట్లు (ముంబయి ఇండియన్స్)
- మహ్మద్ సిరాజ్- రూ.12,25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- మిచెల్ స్టార్క్- రూ.11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- ఫిల్ సాల్ట్- రూ.11.50 కోట్లు (ఆర్సీబీ)
- ఇషాన్ కిషన్- రూ.11.25 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- జితేశ్ శర్మ- రూ.11 కోట్లు (ఆర్సీబీ)
- మార్కస్ స్టొయినిస్- రూ.11 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- కగిసో రబాడా- రూ.10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- టి.నటరాజన్- రూ.10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- మహ్మద్ షమీ- రూ.10 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- నూర్ అహ్మద్- రూ.10 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- రవిచంద్రన్ అశ్విన్- రూ.9.75 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- అవేష్ ఖాన్- రూ.9.75 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- ప్రసిద్ధ్ కృష్ణ- రూ.9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్- రూ.9 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- లియామ్ లివింగ్ స్టన్- రూ.8.75 కోట్లు (ఆర్సీబీ)
- హర్షల్ పటేల్- రూ.8 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- డేవిడ్ మిల్లర్- రూ.7.5 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- ఆన్రిచ్ నోర్కియా- రూ.6.5 కోట్లు (కేకేఆర్)
- హ్యారీ బ్రూక్- రూ.6.25 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- డెవాన్ కాన్వే- రూ.6.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- వనిందు హసరంగ- రూ.5.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- నమన్ ధీర్- రూ.5.25 కోట్లు (ముంబయి ఇండియన్స్)
- ఖలీల్ అహ్మద్- రూ.4.80 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- మహీశ్ తీక్షణ- రూ.4.4 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- అబ్దుల్ సమద్- రూ.4.2 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- గ్లెన్ మ్యాక్స్ వెల్- రూ.4.2 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- నేహాల్ వధేరా- రూ.4.2 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- రచిన్ రవీంద్ర- రూ.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- అశుతోష్ శర్మ- రూ.3.8 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- క్వింటన్ డికాక్- రూ.3.6 కోట్లు (కేకేఆర్)
- మిచెల్ మార్ష్- రూ.3.4 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- రాహుల్ త్రిపాఠి- రూ.3.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- రాహుల్ చహర్- రూ.3.2 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- అభినవ్ మనోహర్- రూ.3.2 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- ఆడమ్ జంపా- రూ.2.4 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- ఐడెన్ మార్క్రమ్- రూ.2 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- రహ్మనుల్లా గుర్బాజ్- రూ.2 కోట్లు (కేకేఆర్)
- మహిపాల్ లోమ్రోర్- రూ.1.7 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- హర్ ప్రీత్ బ్రార్- రూ.1.5 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- విజయ్ శంకర్- రూ.1.2 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)