Jagan-Adani: జగన్ మూడు పర్యాయాలు ఎందుకు అదానీని కలిశారో చెప్పాలి: ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkataramana Reddy questions Jagan over Adani issue

  • జగన్ పై ధ్వజమెత్తిన ఆనం వెంకటరమణారెడ్డి
  • జగన్... అదానీని మూడు సార్లు ఎందుకు కలిశారని ప్రశ్న
  • విద్యుత్ ఒప్పందాల్లో రూ.1,750 కోట్లు దోచుకున్నారని ఆరోపణ

టీడీపీ నేత, రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 

విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీ అవినీతి చేశారని, విద్యుత్ ఒప్పందాల్లో జగన్ రూ.1,750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ మూడు పర్యాయాలు ఎందుకు అదానీని కలిశారో చెప్పాలని నిలదీశారు. విద్యుత్ ఒప్పందాలపై జగన్ మీడియాకు ఒక్క విషయం కూడా చెప్పలేదని అన్నారు. ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చి కథలు అల్లుతున్నారని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. 

జగన్ పై 16 సీబీఐ కేసులు ఉన్నాయని, కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్లలేదని ఆరోపించారు. జగన్ కేసులపై సీబీఐ త్వరగా విచారణ చేపట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News